మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-16 02:53:20  IST  )

బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జోగు రామ‌న్న‌ను హౌస్ అరెస్ట్ చేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న ఉండ‌గా ఆ ప‌ర్య‌ట‌న అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ముందస్తు చ‌ర్య‌గా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జోగు రామ‌న్న‌ను హౌస్ అరెస్ట్ చేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న ఉండ‌గా ఆ ప‌ర్య‌ట‌న అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ముందస్తు చ‌ర్య‌గా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయ‌న ఇంటి ముందు భారీగా పోలీసులు మోహ‌రించారు. ఇదిలా ఉంటే నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఉద‌యం 10.50 గంట‌ల‌కు బేగంపేట నుండి హెలికాప్ట‌ర్ లో ఆయ‌న ఆదిలాబాద్ వెళ్ల‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో చ‌నాక కొర‌ట పంపు హౌస్ ప్రారంభించి నీటిని విడుద‌ల చేస్తారు. అనంత‌రం నిర్మ‌ల్ జిల్లా స‌ద‌ర్ మ‌ట్ బ్యారేజీని ప్రారంభించనున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నిర్మ‌ల్ మినీ స్టేడియంలో బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం ప్ర‌సంగించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు హైద‌రాబాద్ కు తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

Read More..

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికలకు సమర శంఖం.. నేటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

Next Story