- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికలకు సమర శంఖం.. నేటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ గెలుపు కోసం ప్రణాళిక బద్దంగా వెళ్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరిగింది. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ మున్సిపాలిటీల మీద తమ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల పర్యటన (District tours) రాష్ట్రంలో మరింత పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. చనాకా-కొరటా బ్యారేజీ, సదర్మాట్ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభ ద్వారా సీఎం రాబోయే మున్సిపల్ ఎన్నికల (municipal elections) శంఖారావం పూరించనున్నారు. ఇక రేపు మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాలలో పర్యటించబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యారు. మరో వారం రోజుల్లోపే నోటిఫికేషన్ సైతం విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు మున్సిపల్ ఎన్నికల కోసం ఫోకస్ పెట్టగా తాజాగా సీఎం జిల్లాల పర్యటనతో మున్సిపోల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.
Read More..






