- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: మరికాసేపట్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంలో తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ఊ అంటుందా లేదా ఊ అంటుందా లేదా ఊఊ అంటుందా అనేది ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని వారు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? లేదా పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాళ్టి విచారణలో తేలనుంది. స్పీకర్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
గట్టెక్కుతామా?:
అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలేయాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తికాగా తీర్పు రిజర్వులో ఉంది. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ కు ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్క రోజు ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది
Read More..






