అక్రమాస్తుల కేసు.. CBI కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-20 07:03:49  IST  )

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఇవాళ సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు.

అక్రమాస్తుల కేసు.. CBI కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఇవాళ సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలోనే రేపటి లోపు వ్యక్తిగతంగా హాజరవ్వాలని జగన్‌ను కోర్టు ఆదేశించడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More..

నాంపల్లి కోర్టు ఎదుట వైసీపీ శ్రేణుల రచ్చ.. రప్ప రప్ప పోస్టర్ల కలకలం

Next Story