- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి కోర్టు ఎదుట వైసీపీ శ్రేణుల రచ్చ.. రప్ప రప్ప పోస్టర్ల కలకలం

దిశ, వెబ్‌డెస్క్: అక్రమాస్తుల కేసులో భాగంగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఇవాళ నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు (CBI Special Court)కు విచారణకు హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో బయలుదేరిన ఆయన నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అభిమానులకు ఆయన కారు ఎక్కి అభివాదం చేశారు. అనంతరం నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. కేవలం జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు అడ్వకేట్లను మాత్రమే లోపలికి అనుమతించారు. వైసీపీ శ్రేణులతో పాటు జగన్ అభిమానులను పోలీసులు 100 మీటర్ల దూరంలో పికెట్ ఏర్పాటు చేసి కోర్టు ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారంతా రోడ్డుపై గుంపులుగా ఏర్పడి జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ నినాదాలు చేశారు. ‘2029లో రప్పారప్పా’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అందులో “88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే” అంటూ ఉత్సాహంతో ఊగిపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read More..
అక్రమాస్తుల కేసు.. CBI కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్






