ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-07 12:52:11  IST  )

నాంప‌ల్లిలోని తెలంగాణ ఎఫ్ఎస్‌ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: నాంప‌ల్లిలోని తెలంగాణ ఎఫ్ఎస్‌ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపుచేస్తున్నారు. కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక ఫైళ్లు ఉండటంతో ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా తాజాగా ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ ఘటన స్థలానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించినట్టు తెలిపారు. ఇది చాలా పాత భవనం అని చెప్పారు. 1980 సమయంలో కట్టారని అన్నారు. చివరి గదిలో ఉన్న స్విచ్ బోర్డ్ వద్ద షార్ట్ సర్య్కూట్ అయినట్టు తెలిపారు. అక్కడ నుండి మంటలు వ్యాపించాయన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారని అన్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ భవనాలను తనిఖీ చేస్తామని చెప్పారు. రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యాలయాలను తనిఖీ చేస్తామని చెప్పారు. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని కాబట్టి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. ‘ఎప్‌స్టీన్‌’తో పోల్చిన బీఆర్ఎస్ నేత

Next Story