- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంజీబీఎస్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్(MGBS) లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్(MGBS) లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ లో గద్వాలకు వెళ్లే బస్సులు ఆగే ప్రదేశంలో.. ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్లాట్ ఫామ్ వద్ద ఆగి ఉన్న బస్సులో మంటలు రేగడంతో.. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే బస్సు దిగి మంటలార్పే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది మంటలు వ్యాపించకుండా నీళ్లతో ఆర్పివేయడంతో.. పెద్దప్రమాదం తప్పినట్లయింది. మండుటెండల నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో తరచూ అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు సైతం ఎండల్లో ప్రయాణించేటపుడు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకూ అధిక ఉష్ణోగ్రతల సమయాల్లో ప్రయాణించవద్దని అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
ఓఆర్ఆర్ పై ఘోరప్రమాదం.. తగలబడుతోన్న ఎయిర్ ఇండియా బస్సు
Next Story






