- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓఆర్ఆర్ పై ఘోరప్రమాదం.. తగలబడుతోన్న ఎయిర్ ఇండియా బస్సు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద అంబర్ పేట సమీపంలో ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బస్సు అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్ పేట సమీపంలో ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బస్సు అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే డ్రైవర్ కు విషయం చెప్పగా.. బస్సును రోడ్డుపక్కన నిలిపివేశాడు. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. బస్సు విపరీతమైన మంటలతో తగలబడుతుండటంతో ఓఆర్ఆర్ పై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారా లేదా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.






