హైదరాబాద్ ప్రజలకు పాదాభివందనం : కేటీఆర్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-26 08:55:30  IST  )

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్‌ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ ప్రజలకు పాదాభివందనం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్‌ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు తప్ప మరేమీ చేయడం లేదని విమర్శించారు. మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని మండిపడ్డారు. హామీల గురించి ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని, తిట్ల భాష తమకూ వచ్చినా తాము అలా చేయమని అన్నారు.

పెంచుతామన్న పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ రేవంత్‌రెడ్డి ఎగవేశారని, పేమెంట్‌ కోటాలో సీఎం అయ్యారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలంటూ గగ్గోలు పెడుతున్నారని, ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి తట్టుకోలేడని కేటీఆర్ వెల్లడించారు.

Read More..

హరీశ్‌రావు, KTRలను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హీరో నాగార్జున కాంగ్రెస్ నేత వినూత్న లేఖ

Next Story