- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య
by Ratna Kumari |
టేకులపల్లి మండలంలోని సింగ్య తండా వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలంలోని సింగ్య తండా వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మూడ్ తండాకు చెందిన ఎల్లబోయిన కృష్ణ (30) టీజీ 28 టీ 4989 నంబర్ ట్రాక్టర్‌లో జేత్య తండా సమీపంలోని తెల్లవాగు నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను టేకులపల్లికి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
Next Story






