- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవిద్రోహ శక్తులతో కాంగ్రెస్ చీకటి కుట్రలు
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, ఖమ్మం టౌన్ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రభారి, మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ చర్చలకు దూరంగా ఉండి వీధి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దేశ భద్రతతో చెలగాటమాడే కుట్రలను బీజేపీ సహించబోదని హెచ్చరించారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఘటనలో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటంతోనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిరసన కార్యక్రమాలకు తెరలేపుతోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రుద్ర ప్రదీప్, దొంగల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు, ఆర్వీఎస్ యాదవ్, శాసనాల సాయిరాం, వీరవల్లి రాజేష్, పమ్మీ అనిత, అల్లిక అంజయ్య, కొనతం లక్ష్మీనారాయణ, బోయల వెంకట్, నెల్లూరి బెనర్జీ, రవి రాథోడ్, నక్క రవి గౌడ్, రీగన్ ప్రతాప్, గడిల నరేష్, ధనాకుల వెంకటనారాయణ, తాజ్ నూత భద్రం, స్వర్ణ, ఉపేందర్, నకరికంటి వీరభద్రం, ఎల్లారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






