- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ‘NTR వైద్యసేవ’కు రూ.1,000 కోట్లు విడుదల
by Kema Shiva Kumar |
ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు తాజాగా ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పథకం (NTR Vidya Seva Scheme) అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది. పథకాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు, అలాగే ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల కోసం రూ.1,000 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నిధులతో పథకం కింద సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు వేగవంతం కానున్నాయి. దీంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, పేద ప్రజలకు వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా రాయితీపై ప్రత్యేక వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story






