- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే సహించేది లేదు : తలసాని
డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. సికింద్రాబాద్ లోని బాలం రాయిలీ ప్యాలెస్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు.. ప్రత్యేక జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారితే.. కాంగ్రెస్ పాలనలో గ్లోబల్ సిటీ సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో 150 డివిజన్లలను 300 డివిజన్లు చేయడంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల సలహాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి శాంతియాత్ర చేపడుతామని తెలిపారు. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నల్లజెండాలతో శాంతియాత్ర చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్ ను ముట్టడిస్తామని తెలిపారు. ఆపై బంద్ కు పిలుపునిస్తామని చెప్పారు.
READ MORE .....






