Sama Rammohan Reddy: రేవంత్ రెడ్డి కాలి గోటిని కూడా టచ్ చేయలేరు.. తలసాని వ్యాఖ్యలకు సామ కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-01-11 12:19:44  IST  )

గతంలో కేసీఆర్‍ను విమర్శించి ఆ తర్వత వెళ్ళి ఆయన కాళ్లు మొక్కిన తలసాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.

Sama Rammohan Reddy: రేవంత్ రెడ్డి కాలి గోటిని కూడా టచ్ చేయలేరు.. తలసాని వ్యాఖ్యలకు సామ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్‌ పేరుతో సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తలసాని వ్యాఖ్యలను అంత సీరియస్‍గా తీసుకోవద్దని కేసీఆర్‍ను హైదరాబాద్ నుంచి బయటకు ఉరికిస్తామన్న వ్యక్తి ఆ తర్వాత వెళ్లి అదే కేసీఆర్ కాళ్ళు మొక్కారని సెటైర్ వేశారు. డీలిమిటేషన్ కారణంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికి గందరగోళంగా మారిందని అందుకే ఆ ఫ్రస్టేషన్‍లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీల్లో వచ్చిన ఫలితాలు త్వరలో జరగబోయే మున్సిపాలిటీలకు పాకుతాయనే భయంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన సామ.. తలసాని వి మేకపోతు గాంభీర్యం గతంలో కూడా చూశామన్నారు.

రేవంత్ రెడ్డి కాలిగోటిని కూడా టచ్ చేయలేరు:

నీ ఇష్టం ఉన్నట్టు డీలిమిటేషన్ చేసుకోవడానికి నీ అయ్య జాగిరు ఏమీ కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చామల.. గతంలో కేసీఆర్ తన అయ్య జాగీరు అని 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చారు? అని ప్రశ్నించారు. ఆరోజు ఎవరిని అడిగి జిల్లాలు పెంచారు? అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోబోతున్నామనే భయంతోనే ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని టచ్ చేసే సినిమా బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు. గతంలో కేసీఆర్‍ను విమర్శించి ఆ తర్వత వెళ్ళి ఆయన కాళ్లు ఎలా మొక్కారో ఇప్పుడు రేవంత్ రెడ్డిని మాటలు అని భవిష్యత్‍లో రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కవద్దని కోరుకుంటున్నానన్నారు. బీఆర్ఎస్‍లో ఏకాభిప్రాయం లేదన్నారు. ఆ కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలకు వారు అనుభవిస్తున్నారని వారి కుటుంబం ఇప్పుడు ముక్కలు ముక్కలు అవుతోందన్నారు. రేవంత్ రెడ్డి కాలి గోటిని కూడా టచ్ చేయలేరని అన్నారు.

READ MORE .....

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే సహించేది లేదు : తలసాని

Next Story