Jupally Krishna Rao : భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి భేటీ!

by Sathputhe Rajesh |   (  Updated:2023-07-10 06:46:19  IST  )

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి భేటీ అయ్యారు.

Jupally Krishna Rao : భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై భట్టితో జూపల్లి కృష్ణారావు చర్చించారు. ఇటీవలే పొంగులేటి కాంగ్రెస్ లో చేరగా.. ప్రియాంక గాంధీ సమక్షంలో నాగర్ కర్నూల్ సభలో జూపల్లి హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. తన చేరిక గ్రాండ్ గా ఉండేలా జూపల్లి ప్లాన్ చేసుకుంటున్నారు. భట్టితో భేటీ తర్వాత నేరుగా జానారెడ్డి నివాసానికి జూపల్లి వెళ్లారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. చేరికల జోష్ కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ సభపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

Read More : ఎమ్మెల్యే ఈటల, ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం ఉత్తర్వులు

Next Story