- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరికీ కేసీఆర్‌కి పట్టిన గతే! HCU భూముల వేలంపై ఎంపీ ఈటల ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలం (HCU land auction) నేపథ్యంలో వర్సిటీలో హై టెన్షన్ వాతావరణం మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలం (HCU land auction) నేపథ్యంలో వర్సిటీలో హై టెన్షన్ వాతావరణం మొదలైంది. హెచ్‌సీయూలోని భూముల వేలం ప్రాంతంలో తాాజాగా ఎక్కడా చూసిన పోలీసులు, చెట్లు, రాళ్లు చదును చేసే జేసీబీలు (బుల్డోజర్లు) కన్పిస్తున్నాయి. దాదాపు 30 జేసీబీలతో అధికారులు పనులు చేయిస్తున్నారని నెట్టింట ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. జేసీబీలతో పనులు చేయిస్తున్న క్రమంలో పచ్చని భూములను నాశనం చేస్తున్నారంటూ నిన్న విద్యార్థులు తీవ్ర నిరసనలు తెలిపారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌లను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఖండించాయి.
త్వరలోనే వీరికీ కేసీఆర్‌కి పట్టిన గతే: ఈటల
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంను బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే వీరికీ కేసీఆర్ కి పట్టిన గతే పడుతుందని విమర్శలు చేశారు. యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ చెప్పారని, తక్షణమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. విద్యార్థులకి వారి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read More..
Maoist party letter: హెచ్ సీయూ, ఓయూలో రగడ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ






