ఇద్దరు హెచ్ సీయూ పీహెచ్‌డీ స్కాలర్స్‌పై కేసులు..

by Chintha Aamani |   (  Updated:2025-03-31 06:58:11  IST  )

భూముల వేలానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

ఇద్దరు హెచ్ సీయూ పీహెచ్‌డీ   స్కాలర్స్‌పై కేసులు..
X

దిశ,శేరిలింగంపల్లి : భూముల వేలానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఆదివారం స్వల్ప లాఠీఛార్జ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు తాజాగా పలువురిపై కేసులు నమోదు చేశారు. పీహెచ్ డీ విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్.రోహిత్ బొండుగుల పై సెక్షన్ 329(3), 118(1), 132, 191(3), 351(3)r/w3(5) బిఎనఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు అఖిల భారత విద్యార్థి పరిషత్. ( ఏబీవీపీ) విద్యార్థి కాగా మరొకరు (ఎస్ ఎఫ్ ఐ) స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విభాగానికి చెందిన విద్యార్థులు. అలాగే ఇంకొంత మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు హెచ్ సీయూలో సోమవారం భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

Read More: వీరికీ కేసీఆర్‌కి పట్టిన గతే! HCU భూముల వేలంపై ఎంపీ ఈటల ఆసక్తికర ట్వీట్

Next Story