మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-02 12:38:33  IST  )

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఫిబ్రవరిలో జరగాల్సిన అండర్ గ్రాడ్యుయేట్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ఫిబ్రవరిలో జరగాల్సిన అండర్ గ్రాడ్యుయేట్ (UG) సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) దృష్ట్యా విద్యార్థులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్ ఉండటంతో, పరీక్షలను వాయిదా వేశారు. సవరించిన తేదీల ప్రకారం పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై మార్చి 10న ముగియనున్నాయి. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు వెల్లడిచారు. UG మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ (CBCS) విద్యార్థులకు ఈ మార్పులు వర్తించనున్నాయి.

ఇక విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను పరీక్షలు ప్రారంభం కావడానికి 3 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 14 నుంచి యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేధంగా సవరించిన పూర్తి టైమ్ టేబుల్ కోసం www.braou.ac.in లేదా www.braouonline.in వెబ్‌సైట్‌‌ల చూడవచ్చు. ఒకవేళ అప్పటికే హాల్ టికెట్లు జారీ అయి ఉంటే, కొత్త షెడ్యూల్ ప్రకారం మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమని వర్సిటీ అధికారులు సూచించారు. ఇతర సాంకేతిక సమస్యలు, పరీక్షలకు సంబంధించి అదపు సమాచారం కోసం తమ పరిధిలోని స్టడీ సెంటర్లను లేదా వర్సిటీ హెల్ప్ లైన్ నంబర్ 040-23680241 ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్, భద్రతా కారణాల దృష్ట్యా పరీక్షల నిర్వహణ టైమ్ టేబుల్ఋ‌లో మార్పు అనివార్యమైందని, విద్యార్థులు ఈ అదనపు సమయాన్ని ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోవాలని అంబేడ్కర వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Municipal Elections: రెబల్స్‌గా పోటీచేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం

Next Story