న్యూ ఇయర్ నైట్ డ్రామా..! మూడు కమిషనరేట్లలో 2731 మంది మందుబాబులు పట్టుబడ్డారు

by Ramesh Naini |   (  Updated:2026-01-01 10:00:56  IST  )

హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 2731 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు.

న్యూ ఇయర్ నైట్ డ్రామా..! మూడు కమిషనరేట్లలో 2731 మంది మందుబాబులు పట్టుబడ్డారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో డ్రంకన్ డ్రైవింగ్ ఘటనలు రికార్డు స్థాయికి చేరాయి. కొత్త సంవత్సరం సంబరాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 2731 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు.

మద్యం మత్తులో నడిపిన వారిపై కేసులు..

నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ కొందరు హంగామా సృష్టించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు సహకరించకుండా కొందరు వాగ్వాదాలకు దిగగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజల భద్రతకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పోలీసులు, మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం..

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. మొత్తం 2731 మందిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా స్వయం క్రమశిక్షణ పాటించాలని పోలీసులు సూచించారు.

READ MORE .....

నిన్న రాత్రి చిందులు.. నేడు గోషామహల్‌కు మందుబాబుల క్యూ.. ఎందుకంటే?

Next Story