- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిన్న రాత్రి చిందులు.. నేడు గోషామహల్‌కు మందుబాబుల క్యూ.. ఎందుకంటే?
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులు నేడు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు క్యూ కట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులు నేడు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు క్యూ కట్టారు. బుధవారం నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కి నడిరోడ్డుపై చిందులేసిన వారంతా ఈ రోజు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వద్ద భారీ సంఖ్యలో మందుబాబులు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం పట్టుబడిన వారందరికీ ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాలపై అవగాహన
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కౌన్సెలింగ్ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు మరింత కఠినంగా కొనసాగుతాయని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
పట్టుబడిన వారందరిపై కేసులు..
ఇక, న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 2,731 మంది పట్టుబడ్డారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్ కమిషనరేట్‌లో 928 మంది, మల్కాజిగిరి కమిషనరేట్‌లో 605 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారందరిపై కేసులు నమోదు చేశారు.
READ MORE .....
న్యూ ఇయర్ నైట్ డ్రామా..! మూడు కమిషనరేట్లలో 2731 మంది మందుబాబులు పట్టుబడ్డారు






