తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవకాశం ఇది: CM రేవంత్‌కు దత్తాత్రేయుడి లేఖ

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-12 12:12:06  IST  )

తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవకాశం ఇది: CM రేవంత్‌కు దత్తాత్రేయుడి లేఖ

తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవకాశం ఇది: CM రేవంత్‌కు దత్తాత్రేయుడి లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ చారిత్రాత్మక విజయమని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్‌కు లేఖ రాశారు. డీప్‌టెక్, గ్రీన్‌ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు అద్దం పడుతుందని, రూ.ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు రావ‌డం ముఖ్య‌మంత్రి రేవంత్ పాల‌న‌, స్థిర‌త్వం, భ‌విష్య‌త్తుపైన ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

ప్రపంచ వేదికపై తెలంగాణ పోటీ పడటానికి విజన్ 2047 ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు కోసం చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయమని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ప్రజారోగ్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడులు ఉపయోగపడుతాయని చెప్పారు. క్యాన్స‌ర్ చికిత్స‌లో తెలంగాణ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయని అన్నారు. ప్ర‌పంచ దిగ్గ‌జాల‌ను హైద‌రాబాద్, ఫ్యూచర్ సిటీకి ర‌ప్పించి తెలంగాణ‌ను భార‌త దేశ స్టార్ట‌ప్‌గా, మాన‌వ వనరుల అభివృద్దికి తెలంగాణ ప్ర‌పంచ కేంద్రంగా మారుతుంద‌ని రేవంత్ రెడ్డి రుజువు చేశారని అభినందించారు.

READ MORE ....

సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

Next Story