ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్

by Ramesh Naini |   (  Updated:2026-01-17 06:11:36  IST  )

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పలువురు నిరసనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా? అని ప్రశ్నించారు. ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే, రాత్రి 10:40 గంటలకు పోలీసులు రిజెక్ట్ చేశారని తెలిపారు.

ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా? అని వెల్లడించారు. అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చు.. రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారని ఫైర్ అయ్యారు. మేము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూ మాదిరి వేలాది మంది పోలీసులను పెట్టి అందరిని అరెస్టులు చేస్తున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Read More..

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ ర్యాలీకి నో పర్మిషన్.. నేతల అరెస్ట్

Next Story