- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెరపైకి మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ (Reorganization of Districts) చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy)అన్నారు. ఇవాళ అసెంబ్లీలో శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణ వరకు ఇష్టానుసారంగా, ఎవరి అభ్యర్థనలను పట్టించుకోకుండా చేశారని విమర్శించారు. దీంతో ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
అదే విధంగా తమను పొగిడిన వారి కోసం ఒక విధంగా, పొగడని వారి కోసం మరో విధంగా, తమ అదృష్ట సంఖ్యను ఊహించుకుని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో కేబినెట్‌లో విస్తృతంగా చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారుల నుంచి ప్రత్యేక నివేదిక తేప్పించి, ఇదే శాసనసభలో చర్చ చేపట్టి, అందరి ఆమోదంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
Read More..
Kavitha: వెక్కి వెక్కి ఏడ్చినా కవితకు డిపాజిట్లు కూడా రావు..మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
Ponnam: ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాటి కొనుగోలుపై 25 శాతం డిస్కౌంట్






