- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆందోళన బాటలో RTC రిటైర్డ్ ఉద్యోగులు.. ఈ నెల 21 బస్ భవన్ ఎదుట ధర్నా
బకాయిల చెల్లింపుల కోసం తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) విశ్రాంత ఉద్యోగులు (RTC Retired Employees) ఆందోళన బాట పట్టబోతున్నారు. ఈ నెల 21 వ తేదీన బస్‍భవన్ ఎదుట బైఠాయించబోతున్నట్లు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ రాష్ట్ర ప్రతినిధి పట్టాభి లక్ష్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్‍మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఆర్టీసీ యాజమాన్యం తమను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. గత ఆరు నెలలుగా మా ఇబ్బందులను మేనేజ్‍మెంట్‍కు తెలియజేసినా కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. ఇక చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో మా బకాయిల సాధన కోసం ఆందోళన బాట పడుతున్నామని తెలిపారు. జనవరి 21న బస్ భవన్ (Bus Bhavan) ఎదుట మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బైఠాయించి తమ ఆందోళన వ్యక్తం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేల మంది విశ్రాంత ఉద్యోగులు హాజరుకాబోతున్నారని చెప్పారు.
Read More..






