స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల ప్రకటన

by Malleboina Mahesh |   (  Updated:2026-01-19 07:06:49  IST  )

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మేడారం వేదికగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్తలుగా మంత్రులను నియమించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ విజయం కోసం సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం వరకు వీరు పర్యవేక్షించనున్నారు.

ఈ నియామకాల్లో భాగంగా ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్‌బాబులను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు. అలాగే కరీంనగర్ బాధ్యతలను తుమ్మల నాగేశ్వరరావుకు, వరంగల్‌ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఖమ్మం బాధ్యతలను కొండా సురేఖకు అప్పగించారు. ఈ భారీ కసరత్తుతో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి, పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. కాగా మరో మూడు రోజుల్లో ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇన్‌చార్జ్‌ల పూర్తి జాబితా



Read More..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్!

Next Story