తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్!

by Malleboina Mahesh |   (  Updated:2026-01-19 05:16:50  IST  )

మేడారం సమ్మక్క-సారలమ్మ సాక్షిగా ఆదివారం (జనవరి 18, 2026) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి ముహూర్తం ఖరారైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ సాక్షిగా ఆదివారం (జనవరి 18, 2026) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తూ ఎన్నికల సంఘానికి (Election Commission) ప్రభుత్వం లేఖ రాసింది. మరో మూడు రోజుల్లోనే అధికారిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ భేటీలో జిల్లాల పునర్విభజన వంటి కీలక అంశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి అప్పుడే మొదలైపోయింది. ఆశావహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పైరవీలకు తెరలేపారు. అటు గడువు ముగిసిన మున్సిపాలిటీల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.

Read More..

‘హస్తం'లో టికెట్ల యుద్ధం.. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు!

Next Story