డీజీపీ సీవీ ఆనంద్‌ మార్క్ అడ్మినిస్ట్రేషన్.. తొలిరోజే ఎస్పీలు, సీపీలకు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 06:22:31  IST  )

తెలంగాణ డీజీపీగా ఛార్జ్ తీసుకున్న గంటల్లోనే సీవీ ఆనంద్ జిల్లా ఎస్పీలు, సీపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

డీజీపీ సీవీ ఆనంద్‌ మార్క్ అడ్మినిస్ట్రేషన్.. తొలిరోజే ఎస్పీలు, సీపీలకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించబోతున్న విషయం తెలిసిందే. సాధారణంగా కొత్త డీజీపీ బాధ్యతలు చేపడుతున్నప్పుడు జిల్లాల నుంచి అధికారులు హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చి ఆయనను కలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ సంప్రదాయానికి సీవీ ఆనంద్‌ స్వస్తి పలికారు. ఈ క్రమంలోనే సీవీ ఆనంద్ ఆయన తనదైన అడ్మినిస్ట్రేషన్ (Administration) మార్క్‌ను చూపిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

తాను నేను బాధ్యతలు తీసుకుంటున్నానని ఎవరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల ఎస్పీ (SP)లు, సీపీ (CP)లు ఇవాళ ఉదయం కచ్చితంగా తమ తమ కార్యాలయాల్లో విధుల్లో ఉండాలని ఆదేశించారు. అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లోనే రిపోర్ట్ చేయాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా అధికారులను కలుస్తానని, అప్పటి వరకు శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. సీవీ ఆనంద్ తాజాగా ఆదేశాలతో పోలీసు శాఖలో క్రమశిక్షణ, విధి నిర్వహణకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతను ఇండైరెక్ట్‌గా స్పష్టం చేశారు.

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. సంస్కరణల సారథికి పోలీసుల గౌరవ వందనం

Next Story