‘నా డబ్బులు, చీరలు నాకిచ్చేయండి’.. ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్న ఓడిపోయిన అభ్యర్థి

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-15 09:23:45  IST  )

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం.జ్యోతి ఓటమి పాలైన విషయం తెలిసిందే.

‘నా డబ్బులు, చీరలు నాకిచ్చేయండి’.. ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్న ఓడిపోయిన అభ్యర్థి
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ(Muduchintalapalli Municipality)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం.జ్యోతి ఓటమి పాలైన విషయం తెలిసిందే. జ్యోతిపై బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఓటమి తట్టుకోలేకపోతే జ్యోతి ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు, చీరలు తిరిగి ఇవ్వమని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తోంది. ఈ క్రమంలో చీరలు ఎవరు ఇవ్వమన్నారని జ్యోతిపై ఓటర్లు మండిపడుతున్నారు. మరోవైపు.. మూడు చింతలపల్లిలో మొత్తం 24 వార్డులుండగా, బీఆర్ఎస్ పార్టీ 14 వార్డులును గెలుసుకొని ఆధిక్యాన్ని కనబరిచింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 9 వార్డులలో విజయం సాధించగా, బీజేపీ ఒక్క స్థానాన్ని గెలుపొందింది. బీఆర్ఎస్‌కు ఈ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ దక్కడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది.

"దేవుడి మీద ఒట్టు పెట్టి, మా డబ్బులు తిరిగి ఇవ్వు.."ఓడిన అభ్యర్థి హంగామా

Next Story