"దేవుడి మీద ఒట్టు పెట్టి, మా డబ్బులు తిరిగి ఇవ్వు.." ఓడిన అభ్యర్థి హంగామా

by Muthe.Rajitha |   (  Updated:2026-02-15 09:24:47  IST  )

తాము ఎన్నికల్లో పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓడిన అభ్యర్థి డిమాండ్ చేస్తున్న ఘటన వైరల్ అవుతోంది.

దేవుడి మీద ఒట్టు పెట్టి, మా డబ్బులు తిరిగి ఇవ్వు.. ఓడిన అభ్యర్థి హంగామా
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసినప్పటికీ ఆ వేడి ఇంకా చల్లారలేదు. మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా.. గులాబీ, కమలం జోరు ఎక్కడా కనబడలేదు. అయితే ఎలాగైనా ఎన్నికల్లో తాము గెలవాలని అభ్యర్థులు ఓటర్లకు వేలాది రూపాయలు పంచారు. అయితే కొన్నిచోట్ల ఎంత డబ్బు వెదజల్లినా గెలుపు సొంతం చేసుకోలేక చతికిలపడ్డ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వీరు ఓటర్లకు పంచిన డబ్బు తిరిగి వసూలు చేస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.

"డబ్బులు ఇవ్వు లేదా దేవుడి మీద ఒట్టు వెయ్యి.."

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతి, అతని భార్య రూప ఇంటింటికీ తిరిగి తాము పంచిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసారు. "ఎలెక్షన్ లో మాకే ఓటు వేశావా? దేవుడి మీద ఒట్టు వెయ్యి.. లేదంటే మా డబ్బులు మాకు ఇవ్వు.." అంటూ బలవంతంగా వసూలు చేస్తూ.. ఓటర్లను ఇబ్బంది పెట్టారు. కాగా ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఎన్నికల్లో డబ్బులు పంచడమే తప్పు అంటే, ఓడిపోయాక తిరిగి బలవంతంగా వసూలు చేయడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు పంచాయితీ ఎన్నికల సమయంలో కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

‘నా డబ్బులు, చీరలు నాకిచ్చేయండి’.. ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్న ఓడిపోయిన అభ్యర్థి

Next Story