- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ భవన్‌లో కేటీఆర్, తలసానిని పోలీసులు నిర్బంధించారు : దాసోజు శ్రవణ్ ఫైర్
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించి పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించి పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్, తలసాని, ఇతర బీఆర్ఎస్ నేతలను నిర్బంధించారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే రాత్రి నుంచి వందలాది మంది పోలీసులు మోహరించారని అన్నారు.
సికింద్రాబాద్ నీ అయ్య జాగీరా? సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నాశనం చేస్తావా..? అని సీఎం రేవంత్ రెడ్డి పై దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. శాంతియుత ర్యాలీ చేయొద్దని గాంధీ చెప్పాడా? అని మండిపడ్డారు. ఇప్పుడు ర్యాలీలపై జులుం చూపిస్తున్న నువ్వు ఎన్నిసార్లు ర్యాలీలు చేయలేదని నిలదీశారు. సీఎం ఆఫీస్, ఈడీ ఆఫీస్‌ల దగ్గర ధర్నాలు చేయలేదా? అని ప్రశ్నించారు. పోలీసులను ఉసిగొల్పి అడ్డమైన కేసులు పెడతారా? అని కాంగ్రెస్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ ఆగ్రహం వక్తం చేశారు. అక్రమంగా జర్నలిస్టులను అరెస్టు చేయించారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. నీకు టైమ్ దగ్గర పడిందని వార్నింగ్ ఇచ్చారు. నాడు ఔరంగజేబు గోల్కొండపై దండెత్తి హైదరాబాద్ పేరు మార్చిండని గుర్తుచేశారు. మళ్లీ ఇవాళ రేవంత్ అనే నియంత సికింద్రాబాద్‌ను నామరూపాల్లేకుండా చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్‌కు 200 ఏండ్ల చరిత్ర ఉందని, సీఎం ఎన్ని ఆంక్షలు పెట్టినా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని అన్నారు.
Read More..






