- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భావం.. తొలి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీజన
హైదరాబాద్ మహా నగర పాలనను మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ (GHMC)ని విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగర పాలనను మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ (GHMC)ని విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Cyberabad Municipal Corporation) తొలి కమిషనర్‌గా ఐఏఎస్ శ్రీజన (IAS Srijana) బాధ్యతలు స్వీకరించారు. ఆమె వెంట మూడు కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారిగా నియమించబడిన సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ (Jayesh Ranjan) కూడా ఉన్నారు. ఇకం నుంచ కమిషనర్ శ్రీజన ఐటీ కారిడార్, వెస్ట్ హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. ఐటీ హబ్ అయిన సైబరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదల లాంటి ప్రధాన సవాళ్లు ఆమె ముందు ఉన్నాయి.
కాగా, 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి శ్రీజన తన సమర్థతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె గతంలో విశాఖపట్నం (GVMC) కమిషనర్‌గా, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. కోవిడ్ సమయంలో బాలింతగా ఉండి కూడా కేవలం 22 రోజులకే విధుల్లోకి చేరి తన కర్తవ్యాన్ని నిర్వహించి అందరి మెప్పు పొందారు.






