- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఎఫెక్ట్.. పలువురు నాన్-క్యాడర్ అధికారులు బదిలీ
రాష్ట్ర ప్రభుత్వ పాలనా అవసరాల దృష్ట్యా పలువురు నాన్-క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ పాలనా అవసరాల దృష్ట్యా పలువురు నాన్-క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు పేరిట జీవో నంబర్ 204 ద్వారా ఈ బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీ యూసీడీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్. పంకజను బదిలీ చేసి మల్కాజ్‌గిరి హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ (HMWS & SB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న సామ్రాట్ అశోక్ నామను హైదరాబాద్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ (HMWS & SB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమించారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా ఉన్న ఎం.సంతోష్‌ను సైబరాబాద్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ (HMWS & SB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా బదిలీ చేశారు. ఉపాధి, శిక్షణ శాఖలో అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న కె.శశికిరణాచారి లోక్‌భవన్ సంయుక్త కార్యదర్శిగా (Joint Secretary) నియమించారు. అయితే, ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.






