- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలే: మహేశ్ కుమార్ గౌడ్
శాస్త్ర సాంకేతిక పరంగా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలే అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: శాస్త్ర సాంకేతిక పరంగా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలే అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో నేడు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడానికి కారణం రాజీవ్ గాంధీ దూర దృష్టి వల్లనే అని చెప్పారు. ఆనాడు వాళ్లు చేసిన కృషి వల్లనే నేడు మనం అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని వ్యాఖ్యానించారు.
తరవత తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బంగారం కుదువబెట్టకునే పరిస్థితి నుండి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని అన్నారు. తరవాత వారి శిష్యులు అయిన మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ మదిలో నుండి పుట్టిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అనంతపూర్ లో పర్యటిస్తున్న సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఉండటం చూసి సోనియా గాంధీకి ఆ ఆలోచన పుట్టిందని అన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధిహామీ పథకాన్ని తీసుకువస్తే మోడీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
Read More..
Congress: మా పని అయిపోయిందంటున్నారు కానీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఖర్గే ఫైర్






