రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్.. సర్కార్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Taduka Kalyani |   (  Updated:2025-05-06 07:26:49  IST  )

రాష్ట్ర ముఖ్యమంత్రి అమాయకంగా సింపతి తో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్.. సర్కార్  పై బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, ఎల్లారెడ్డిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి అమాయకంగా సింపతి తో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ భవనం లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూర్ఖులకి మూర్ఖుడు రేవంత్ అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు వెంటనే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఇచ్చేది మొత్తం కేంద్ర ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదని విమర్శించారు.

రైల్వే అభివృద్ధికి 32 కోట్లు ఖర్చు పెట్టాము..

10 సంవత్సరాల కాల వ్యవధిలో 12 లక్షల కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టినామని అన్నారు. రైల్వే పనులు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2500 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పది వేల కిలోమీటర్లు రైల్వే రోడ్లు వేసినామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమాయకంగా సింపతితో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సంవిధాన్ బుక్ తీసుకుని రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి, సంవిధాన్ బుక్ మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్టే అని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదుల పట్ల, మావోయిస్టుల పట్ల ఉపేక్షించేది లేదని నొక్కి చెప్పారు. గన్ను పట్టినోడితో చర్చలు ఏ విధంగా జరుపుతామని అన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ తెస్తామని చెప్పిన ప్రజలు మమ్మల్ని నమ్మకుండా ఆరు గ్యారంటీ లు అమలు చేస్తామని చెప్పి 420 హామీలతో గద్దె నెక్కారని కాంగ్రెస్ పార్టీ పనితీరును విమర్శించారు.

రాష్ట్రం పరిపాలన చేయడానికి ఎక్కడ అప్పు పుట్టడం లేదని అనడం సిగ్గు చేటని, దౌర్భాగ్యం పాలన నడుస్తోందని అన్నారు. సామాన్య ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ ల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని బండి అన్నారు. 2023 డిసెంబర్ లో ప్రధాన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఒకసారి, 2024 జూలై లో ఒకసారి 2025 ఫిబ్రవరి లో ఒకసారి, హైదరాబాద్ లో నితిన్ గడ్కరీ ని కలిశారని అన్నారు. బ్యాంక్ లకు పోతే చెప్పులు ఎత్తుకెళ్లే దొంగ లెక్క చూస్తున్నారని అనడం హాస్యాస్పదం గా ఉందని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి, పొన్నాల తిరుపతి రెడ్డి, కంచర్ల పర్శరాములు, దాసరి గణేష్, రాగుల గాల్ రెడ్డి, నంది నరేష్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Read More..

కుటుంబ పెద్దే చేతులెత్తేస్తే పరిస్థితి ఏంది.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్

Next Story