- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో శివాలయ పూజారి హల్‌చల్
by Batti.Sumithra |
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శివాలయ పూజారి మద్యం మత్తులో హల్‌చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శివాలయ పూజారి మద్యం మత్తులో హల్‌చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం పూజారి మద్యం సేవించి ఆలయ పరిసరాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ భక్తులకు, స్థానికులకు ఇబ్బందులు కలిగించినట్లు సమాచారం. పూజారి ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని పూజారిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే విధంగా జరిగిన ఈ ఘటన పై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






