రామ్ సరికొత్త ప్రయోగం.. సూపర్ ఐడియా

by Pulgam srinivas |

రామ్ తన ఫస్ట్ డైరెక్షన్ మూవీ కోసం ముందుగా రెండు రోజుల డెమో షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

రామ్ సరికొత్త ప్రయోగం.. సూపర్ ఐడియా
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారిగా తానే కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ప్రస్తుతం ఈ మూవీ ‘RAPO23’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం ప్రస్తుతం మేకర్స్ పెద్ద ఎత్తున వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొదటగా హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఈ సినిమా కోసం ఆమె దాదాపు కోటిన్నర వరకు పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం.

అంత మొత్తాన్ని చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో మేకర్స్ ఆమెను పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు కయాడు లోహర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోతే, సంయుక్త మీనన్‌ను మరో ఆప్షన్‌గా భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే, తన తొలి దర్శకత్వ సినిమా కోసం రామ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో రెండు రోజుల పాటు డెమో షూట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అది సంతృప్తికరంగా వస్తే వెంటనే గోవాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ లొకేషన్ల వెతుకులాట కూడా మొదలైనట్లు సమాచారం. మొత్తానికి తన తొలి దర్శకత్వ సినిమా కోసం రామ్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Next Story