- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రష్.. వారికి దర్శనమయ్యేది రాత్రికే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్నటి కంటే నేటి ఉదయానికి కంపార్టుమెంట్లలో ఉన్న భక్తుల సంఖ్య తగ్గింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్నటి కంటే నేటి ఉదయానికి కంపార్టుమెంట్లలో ఉన్న భక్తుల సంఖ్య తగ్గింది. బుధవారం ఉదయం 7 గంటల సమయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 8 గంటల తర్వాత క్యూలైన్లోకి ఎలాంటి టోకెన్ లేకుండా దర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 12-15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రూ.300 శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-4 గంటల సమయం, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 4-6 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.
నిన్న (మంగళవారం) స్వామివారిని 86,601 మంది భక్తులు దర్శించుకోగా.. 31,111 మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు సమకూరగా.. 4.32 లక్షల లడ్డూలను విక్రయించారు. 2.16 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించారు.






