ఆ తేదీ నుంచి ‘మెగా 158’ థర్డ్ షెడ్యూల్ ప్రారంభం

by Pulgam srinivas |

'మెగా 158' సినిమా థర్డ్ షెడ్యూల్ జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఆ తేదీ నుంచి ‘మెగా 158’ థర్డ్ షెడ్యూల్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్ ఖరారు కాకపోవడంతో, ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాయి. తాజాగా మూడో షెడ్యూల్‌కు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు పలువురు కీలక నటీనటులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో అనశ్వర రాజన్, చిరంజీవికి కూతురు పాత్రలో కనిపించనుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story