Municipal Elections: ప్రత్యర్థులకు చెక్‍మెట్.. పీఏసీ మీటింగ్‍లో రేవంత్ రెడ్డి కీలక దిశానిర్దేశం!

by Prasad Jukanti |   (  Updated:2026-02-02 08:23:46  IST  )

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, పీసీసీ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించారు.

Municipal Elections: ప్రత్యర్థులకు చెక్‍మెట్.. పీఏసీ మీటింగ్‍లో రేవంత్ రెడ్డి కీలక దిశానిర్దేశం!
X
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రులు, పీసీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) జూమ్ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీఏసీ సభ్యులు ఈ మీటింగ్‍కు హాజరయ్యారు. ఇందులో మున్సిపల్ ఎన్నికలు, ప్రచార వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలు చర్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలను
(Municipal Elections)
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం.

రెబల్స్ పై ఫోకస్:

విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇకక రాష్ట్రంలోని రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ పీఏసీ సమావేశం, ఎల్లుండి నుంచి జిల్లాల పర్యటనలతో ఆయన షెడ్యూల్ బిజీ బిజీగా మారనుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల పార్టీ నేతలు ఒకరికంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారంతా పార్టీ టికెట్ మాకే అంటే మాకే కావాలంటూ పోటీ పడుతున్నారు. దీంతో రెబల్స్ బరిలో ఉంటే గెలుపోటములపై ప్రభావం చూపే వకాశం ఉండటంతో ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని విదేశాల నుంచే సీఎం పార్టీ నేతలకు ఆదేశించారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో ఇవాళ్టీ పీఏసీ సమావేశంలో సీఎం ఈ అంశంపై కీలక సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More..

Next Story