- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ పోరుపై నజర్ పెట్టిన కాంగ్రెస్.. మరికొద్ది సేపట్లో పీఏసీ కీలక భేటీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు, గెలుపు వ్యూహాలపై చర్చించేందుకు నేడు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం కానుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు, గెలుపు వ్యూహాలపై చర్చించేందుకు నేడు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు జూమ్ యాప్ ద్వారా పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు బీ-ఫామ్‌ల కేటాయింపుపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసంతృప్తులు రాకుండా, గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపే చివరి గడువు కావడంతో, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడం, పార్టీ అధికారిక అభ్యర్థులకు మద్దతు కూడగట్టడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరికాసేపట్లో జరగనున్న పీఏసీ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది.
Read More..






