మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా 33 మందిపై కేసు నమోదు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-02 03:42:37  IST  )

తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసింది.

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి ఎర్రబెల్లి  సహా 33 మందిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case)లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం.. ఖమ్మం-వరంగల్ హైవే పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Former Minister Errabelli Dayakar Rao) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదం జరగడమే కాకుండా, వారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మరో 33 మందిపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 189(2), 223, 126(2), 132 r/w 190 కింద అధికారులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి, ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది.

Read More..

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.. బరిలో 19,608 మంది అభ్యర్థులు

Next Story