మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.. బరిలో 19,608 మంది అభ్యర్థులు

by Malleboina Mahesh |

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.. బరిలో 19,608 మంది అభ్యర్థులు
X

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ (Scrutiny of nominations) ప్రక్రియను ఎన్నికల అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశీలన అనంతరం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు, స్వతంత్రుల తరపున మొత్తం 19,608 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా ఖరారు కావడంలో ఇది కీలక దశగా మారింది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ (Scrutiny of nominations)కు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది వివరాలను, వారి జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆన్‌లైన్‌లో పొందుపరచనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి, 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ ప్రతిపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో తమ వ్యూహాలను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు పోటీలో నిలిచే వారి సంఖ్య కూడా అధికంగా కనిపిస్తుంది.

Next Story