TG: గాంధీ విగ్రహా ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-22 12:26:26  IST  )

బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి హరీష్ రావుపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

TG: గాంధీ విగ్రహా ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి హరీష్ రావుపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులను హరీష్ రావు తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వాన్ని నిందించాలని హారీష్ రావు చూస్తున్నారు. గాంధీ సరోవర్ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు 2012లో ఉన్న జీఓ ప్రకారం 30 మీటర్స్ బఫర్ ఉండాలి. గత ప్రభుత్వం కమీషన్లకు కకక్కుర్తి పడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చారు. గత ప్రభుత్వం కమీషన్లు దండుకోవడం కోసం చేసిన పనికి అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అపార్ట్ మెంట్ వాసులకు నష్ట పరిహారం ఇస్తుంది. బిల్డర్లపై కచ్చితంగా కేసులు పెడతాము. వారిచేత అపార్ట్ మెంట్ వాసులకు నష్ట పరిహారం కూడా ఇప్పిస్తాము. 30 మీటర్లు బఫర్ ఉండాల్సిన చోట 9 మీటర్లు బఫర్ చూయించి నాళా మీద మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు పర్మిషన్ తీసుకున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో ప్రజల తప్పు లేదు..

రోజూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మెట్రో ఫేజ్-2, మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. డీపీఆర్ ఎప్పుడు ఇస్తారో హరీష్ రావుకు తెలియదా?. సబర్మతి, గంగా నదుల పునరుజ్జీవం కోసం అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వలన ప్రజలు తెలియక అపార్ట్ మెంట్స్ కొనుక్కున్నారు. ఇందులో ప్రజల తప్పు లేదు. గత ప్రభుత్వం అవినీతి ఉందని హరీష్ రావు తెలుసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో నాళాల మీద పర్మిషన్లు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతి పనికి అడ్డుపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయవద్దని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల అభిమానం పెరిగిందని బీఆర్ఎస్‌కు అర్ధం అయిందని చామల కిరణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ.. బాధితులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరోసా

Next Story