- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ.. బాధితులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరోసా
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రాజెక్టు పైన విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేయడం వాళ్లకు ఇష్టం లేదని మండిపడ్డారు. మూసీ బాగైతే హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ని గుర్తు పెట్టుకుంటారని బీఆర్ఎస్ భయం అని విమర్శించారు. గతంలో హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తానని కేసీఆర్ బడాయి కబుర్లు చెప్పారని గుర్తుకు చేశారు.
మల్లన్న సాగర్ బాధితులు చనిపోయారు..
మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని కేటీఆర్ మాటలు చెప్పి నగర ప్రజలను మోసం చేశారని, మూసీ పేరుతో కోట్ల రూపాయలు మేశారని ఆరోపించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని, బాధితుల డిమాండ్ లను ప్రభుత్వం వింటుందని స్పష్టం చేశారు. వాళ్లు సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారు. వాళ్లని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని హరీశ్ రావు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అపార్ట్‌మెంట్‌కు నోటీసులు ఇచ్చామని అక్కడికి వెళ్లి తెగ సానుభూతి చూపిస్తున్నాడని విమర్శించారు. మల్లన్న సాగర్ కోసం 14 గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు హరీశ్‌రావుకి ఇవి గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు చర్యల వల్ల మల్లన్న సాగర్ బాధితులు అనేక మంది చనిపోయారని ఆరోపించారు.
ప్రతి పక్షాల వలలో చిక్కోద్దు..
ఒకరు గ్రామం వదలలేక ఇంట్లోనే చితి పేర్చుకుని సజీవ దహనం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు పోలీస్‌లను పెట్టి బలవంతంగా గ్రామాల నుండి నిర్వాసితులను ఈడ్చి వేశారని అన్నారు. అందులో హరీశ్‌రావు పాపమే ఉంది.. ఆ పాపాల భైరవుడు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నాడని ఫైర్ అయ్యారు. మూసీ నిర్వాసితుల పట్ల మాకు సానుభూతి ఉంది.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి పక్షాల వలలో చిక్కోద్దు.. ప్రభుత్వంతో చర్చించి న్యాయం జరిగేలా మేము కూడా చూస్తామని భరోసా కల్పించారు.






