తెలంగాణలో కవిత కొత్త పార్టీ.. ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన కాంగ్రెస్ ఎంపీ..

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-25 13:20:01  IST  )

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)పై కాంగ్రెస్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కవిత కొత్త పార్టీ.. ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన కాంగ్రెస్ ఎంపీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవితకు రాజకీయంగా శుభాకాంక్షలు తెలుపుతూనే, ఆమె పార్టీ స్థాపన వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణను గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా దోపిడీ చేశారని చామల ఆరోపించారు. "ఆ పదేళ్ల కాలంలో కవిత గారు బీఆర్ఎస్ పార్టీలోనే కీలక నేతగా ఉండి, ఈ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఆమె పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో కొంతైనా ఆదరణ ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి ఇంటికి పంపించిన తర్వాతే కవితకు తెలంగాణ గుర్తుకు వచ్చిందా అని చామల ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "కుటుంబంలో లేదా దోపిడీ వాటాల్లో తేడాలు రావడం వల్లే కవిత గారు ఇంటి నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టారని ప్రజలు భావిస్తున్నారు. మళ్లీ తెలంగాణను దోచుకోవడానికే ఈ కొత్త ఎత్తుగడ అని జనం అనుమానిస్తున్నారు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎంపీ..

కవిత విమర్శలు పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నందుకు స్పందిస్తూ.. "ఏదేమైనా కవిత గారికి ఆల్ ది బెస్ట్" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మొత్తానికి కవిత పార్టీ ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండొద్దు: కవితకు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

Next Story