నువ్వో ఫ్లాప్ యాక్టర్, చెప్పుదెబ్బలు తింటావ్.. శివాజీకి కాంగ్రెస్ మహిళా నేత వార్నింగ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-24 09:19:57  IST  )

టాలీవుడ్ న‌టుడు శివాజీ ఇటీవ‌ల మ‌హిళ‌ల‌పై చేసిన కామెంట్లు వివాదాస్ప‌దంగా మారాయి. దీంతో శివాజీ వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయంటూ ఆయ‌నపై ప‌లురువు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నువ్వో ఫ్లాప్ యాక్టర్, చెప్పుదెబ్బలు తింటావ్.. శివాజీకి కాంగ్రెస్ మహిళా నేత వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ న‌టుడు శివాజీ ఇటీవ‌ల మ‌హిళ‌ల‌పై చేసిన కామెంట్లు వివాదాస్ప‌దంగా మారాయి. దీంతో శివాజీ వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయంటూ ఆయ‌నపై ప‌లురువు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మ‌హిళా నేత సునితా రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏ త‌ల్లి క‌న్న‌దో ఆ త‌ల్లిని ఇనుప‌సామాన్ల డ‌బ్బాతో శివాజీ పోల్చ‌డం పాలు తాగి రొమ్ముగుద్దే ర‌కంగా ఉంద‌ని అన్నారు. గ‌తంలో శివాజీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు క‌లిగిన బీజేపీతో ఉన్నాడ‌న్నారు.

మొన్న నితీష్ కుమార్ కూడా ఓ మ‌హిళ హిజాబ్ గుంజార‌న్నారు. శివాజీ ఫ్లాప్ యాక్ట‌ర్ అని ప‌బ్లిసిటీ కోస‌మే ఇలాంవి చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న గురించి మాట్లాడడం కూడా అన‌వ‌సం అని అస‌హనం వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌ల బ‌ట్ట‌ల గురించి మాట్లాడే హ‌క్కు శివాజీకి ఎక్క‌డిది అనే ప్ర‌శ్నించారు. ఇద్ద‌రు కొడుకులే ఉన్నార‌ని ఒక కూతురు ఉంటే శివాజీకి మ‌హిళ‌ల విలువ తెలిసేద‌న్నారు. మ‌హిళా క‌మిష‌న్ ఇప్ప‌టికే సుమోటాగా కేసును స్వీక‌రించిందని చ‌ర్య‌లు కూడా త‌ప్ప‌వ‌న్నారు. ఎలాంటి స్టేజిపై శివాజీ మాట్లాడాడో అలాంటి వేధిక‌పైనే మ‌హిళ‌లంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పించాల‌ని అన్నారు.

Read More..

మహిళలు ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పాల్సినవసరం లేదు.. శివాజీపై విశ్వక్ సేన్ ఫైర్

Next Story