- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పాల్సినవసరం లేదు.. శివాజీపై విశ్వక్ సేన్ ఫైర్
దండోరా సినిమా ఈవెంట్‌లో నటుడు బాలాజీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హీరోయిన్లు పద్దతిగా బట్టలు ధరించాలని సూచిస్తూ శివాజీ కొన్ని నీచమైన పదాలను వాడారు.

దిశ, వెబ్ డెస్క్: దండోరా సినిమా ఈవెంట్‌లో నటుడు బాలాజీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హీరోయిన్లు పద్దతిగా బట్టలు ధరించాలని సూచిస్తూ శివాజీ కొన్ని నీచమైన పదాలను వాడారు. దీంతో శివాజీ తాను మంచే చెప్పాలని భావించాలని చెప్పినా ఆయన వ్యాఖ్యలపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా మంది ఇండస్ట్రీలోని వాళ్లే శివాజీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అదే స్టేజిపై నిలుచుని ఉన్న నటుడు నవదీప్ శివాజీ చేసిన కామెంట్స్ తప్పు అని ఒప్పుకోగా మంచు మనోజ్ ఖండిస్తూ ట్వీట్ చేశారు.
అనసూయ, మంచు లక్ష్మి, యాంకర్ సుమ లాంటి వాళ్లు సైతం శివాజీ కామెంట్స్ ను ఖండించారు. కాగా తాజాగా హీరో విశ్వక్ సేన్ సైతం మహిళలకు మద్దతిస్తూ శివాజీపై మండిపడ్డారు. అభిప్రాయాలు సర్వసాధారణం అని కానీ కొన్ని మాట్లాడకుండా ఉండాలన్నారు. ఈ పురుషుడు అర్థం లేని విషయాలను వ్యాప్తి చేయడం మానేయాలని పేర్కొన్నారు. మహిళలు ఏం ధరించాలో..ఎలా ఉండాలో నిర్దేశించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వ్యక్తి నిజమైన పురుషులకు ప్రాతినిథ్యం వహించడని స్పష్టం చేశారు.






