- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాసంగి రైతు భరోసా కోసం ప్రభుత్వం కసరత్తు.. రెండ్రోజుల్లో డబ్బులు?
యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేస్తామన్నారు. తాజాగా ఈ అంశంపై అప్డేట్ వచ్చింది. యాసంగి రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు సమీకరించే పనిలో పడింది. ఇందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా రూ.9 వేల కోట్ల రుణాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్బీఐలో ఇండెంట్ సమర్పించగా.. 10న ఈ-వేలం ద్వారా రుణాన్ని పొందనుంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతపెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం ఇదే తొలిసారి.
రూ.9000 కోట్ల రుణాన్ని 13 సంవత్సరాల కాలపరిమితితో రూ.2000 కోట్లు, 16 ఏళ్లకు మరో రూ.2000 కోట్లు, 21 ఏళ్ల కాలపరిమితితో రూ.2500 కోట్లు, 27 ఏళ్లకు రూ.2500 కోట్లు చొప్పున రుణం తీసుకోనుంది. వేలం పూర్తయ్యాక నిధులు నేరుగా ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. నిధులు జమయ్యే సరికి మున్సిపల్ ఎన్నికలు పూర్తవుతాయి. ఇప్పటికే రైతుల జాబితా సిద్ధం చేయగా.. ఎన్నికలు పూర్తయిన మూడు నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.






