- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాహాబాహీకి దిగిన BRS శ్రేణులు.. పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాతంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్/నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా తిమ్మాజిపేట (Thimmajipet) మండల పరిధిలోని అవంచ (Avancha) గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అదే పార్టీకి చెందిన రెబల్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు చంద్రకళ, సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ పరస్పర దాడులలో ఇద్దరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం సమీపంలోని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణపై తిమ్మాజీపేట ఎస్సైను ‘దిశ’ ప్రతినిధి వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.
READ MORE ....
ధర్మారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు






