ధర్మారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-14 07:11:37  IST  )

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ధర్మారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి (Dichpally) మండలం ధర్మారం (Dharmaram) గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ అభ్యర్థి వర్గం మరొకరిపై పోలింగ్ బూత్ లోపల రిగ్గింగ్ చేస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తూ అక్రమంగా ప్రచారం నిర్వహిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం వైపు దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు పోలింగ్ బూత్ లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో పోలీసులతో తోపులాట జరిగింది. దీంతో వారు పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు స్వల్పంగా లాఠీలు ఝుళిపించి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ సాధారణంగా కొనసాగుతోంది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని అనేక మండలాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది.

READ MORE ....

బాహాబాహీకి దిగిన BRS శ్రేణులు.. పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Next Story